ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా విజయవాడ గొల్లపూడిలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని 99 మంది తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు నూతన వస్త్రాలను అందించి.. ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని అన్నారు. పరిపాలనలో మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు.
అవనిగడ్డలో..
కృష్మా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మోపిదేవిలో రక్తదానం..