NTR Centenary Celebrations: కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరులో తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. నిమ్మకూరు గ్రామంలోని నందమూరి బసవతారకం ఎన్టీ రామారావు విగ్రహాల వద్ద గ్రామస్తులు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామస్తులకు ఆయనతో స్నేహ సంబంధాలు, బంధువులు గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఎన్టీఆర్ గ్రామానికి చేసిన మేలు గురించి వివరించుకున్నారు. రాష్ట్రంలోని పేద మహిళల అభ్యుదయం కోసం మహిళా సదనం నిర్మించి ఎందరో మహిళలకు చేయూతనిచ్చి చేతివృత్తులు నేర్చుకునే చేశారన్నారు. మహిళలు స్వశక్తితో జీవించేలా దారిచూపారని కొనియాడారు. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఏపీఎన్ఆర్జేసీ జూనియర్ కాలేజీ, స్కూల్ నిర్మించారని అన్నారు.
నిమ్మకూరులో.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు - కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
NTR Centenary Celebrations: నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు కేక్‌లు కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. గ్రామానికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు