ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్యాన్సర్ బాధితునికి తెదేపా ప్రవాసాంధ్ర నేతల సాయం - కృష్ణాజిల్లా తాజా వార్తలు

క్యాన్సర్ తో బాధపడుతున్న తెదేపా కార్యకర్త గొర్లి మోహనరావు కుమారుడు అరవింద్ గౌరి నాయుడుకు తెదేపా ప్రవాసాంధ్రుల విభాగం ఆర్థిక సాయం అందించింది. బాధిత కుటుంబానికి తెదేపా అన్ని విధాల అండగా ఉంటుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

నారా లోకేశ్​కు చెక్కును అందిస్తున్న తెదేపా ప్రవాసాంధ్రులు
నారా లోకేశ్​కు చెక్కును అందిస్తున్న తెదేపా ప్రవాసాంధ్రులు

By

Published : Jan 28, 2021, 8:00 AM IST

కృష్ణా జిల్లా నర్సీపట్నానికి చెందిన తెదేపా కార్యకర్త.. గొర్లి మోహన్​రావు కుమారుడు అరవింద్ గౌరి నాయుడు క్యాన్సర్​తో బాధపడుతున్నాడు. కుమారునికి మెరుగైన వైద్యం అందించడానికి మోహన్​రావు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న తెదేపా ప్రవాసాంధ్రుల విభాగం.. రెండు లక్షల ఆర్ధిక సాయాన్ని అందించింది.

ఈ చెక్కును తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్​కు ఉండవల్లిలోని ఆయన కార్యాలయంలో ప్రవాసాంధ్ర తెదేపా నేతలు అందజేశారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన వారిని లోకేశ్ అభినందనలు తెలిపారు. బాధిత కుటుంబానికి.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details