కరోనాపై పోరుకు లలితా జ్యువెలరీ మార్ట్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. సీఎం సహాయనిధికి అమెరికాలోని ప్రవాసాంధ్రులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి, 50 లక్షల విరాళం ఇచ్చారు. వారి కుటుంబసభ్యులు సహా వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చెక్కును సీఎంకు అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ.30 లక్షల విరాళం అందించింది. ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ డీడీనీ సీఎంకు అందించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ.17లక్షలు విరాళం చెక్కును ఆ బ్యాంకు ఆర్ఎం రామకృష్ణ సీఎం జగన్కు అందించారు.
కరోనాపై పోరుకు దాతల విరాళం - corna news in krishna dst
కరోనా నివారణ, సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ బంగారం విక్రయ సంస్థ లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. కోటి విరాళం ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన ఆసంస్థ సీఎండీ డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.
![కరోనాపై పోరుకు దాతల విరాళం NRIs contribute money to CMRF IN krishna dst thadepallicamp office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7184120-792-7184120-1589375300998.jpg)
NRIs contribute money to CMRF IN krishna dst thadepallicamp office