బ్యాంకు పనుల కోసం ఖాతాదారులు ఒక్కసారిగా చేరుకోటంతో రద్దీ ఎక్కువవుతోంది. భౌతిక దూరాన్ని విస్మరించి ఖాతాదారులంతా గుంపులు గుంపులుగా చేరుతున్నారు. కృష్ణాజిల్లా దివిసీమలో ఎస్బీఐ బ్యాంకు ముందు ఇదే పరిస్థితి నెలకొంది. అవనిగడ్డ ఎస్సై డి.సందీప్... బ్యాంక్ అధికారులను పిలచి టోకెన్ పద్దతి అమలు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బ్యాంకుల్లో కనిపించని భౌతిక దూరం..!
కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఖాతాదారులు గుమిగూడారు. అధికారులు హాటాహుటిన చేరుకుని టోకెన్ పద్దతి అమలు చేయాలని, భౌతిక దూరం పాటించాలని బ్యాంకు సిబ్బందికి సూచించారు.
not maintaing social distance in banks at krishna dst
TAGGED:
covid cases in krishna dst