రాష్ట్రంలో పురపాలక ఎన్నికలకు నేడు నామినేషన్లు స్వీకరణ జరగనుంది. అయితే... బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించిన ప్రాంతాల్లో మాత్రమే... నేడు నామపత్రాలు తీసుకోనున్నారు. ఈ మేరకు అవకాశం కల్పించిన ఎస్‌ఈసీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపింది.
అనంతరం.. నామపత్రాలను పరిశీలిస్తారు. రేపు మధ్యాహ్నం 3 వరకు ఉపసంహరణ గడువుగా అధికారులు తెలిపారు. తిరుపతిలోని 2, 8, 10, 21, 41, 45 వార్డులకు.. పుంగనూరులోని 9, 14, 28 వార్డులకు.. రాయచోటిలో 20, 31 వార్డులకు... కడప జిల్లా ఎర్రగుంట్లలోని 6, 11, 15 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు.