ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కృష్ణ'మ్మ వెలవెల... రైతన్న విలవిల - no water in krishna river due to no rains

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణ మున్నేరు, వైరాలలో నీరు కానరావడం లేదు. జిల్లాలోని ఎత్తిపోతల ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు అధికారులు సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

no-water-in-krishna-river

By

Published : Jun 23, 2019, 12:47 PM IST

Updated : Jun 23, 2019, 2:59 PM IST

కృష్ణ వెలవెల...రైతన్నల విలవిల

జూన్ 4వ వారం వచ్చినా వర్షాలు లేకపోవటం.. కృష్ణా జిల్లా రైతాంగంలో ఆందోళన పెంచుతోంది. సకాలంలో వర్షాలు పడని కారణంగా.. ఇప్పటికే జిల్లాలోని ఎత్తిపోతల ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. కృష్ణ మున్నేరు, వైరాలలో నీరు లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమైంది. పశ్చిమ కృష్ణాలోని సుమారు 90 ఎత్తిపోతల పథకాల కింద లక్షా 10 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఇప్పటివరకూ కనీసం ఒక్క ఎకరా సాగులోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ఆలోచిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సాగు చేసేందుకు విత్తనాలు ఇవ్వాలని.. తగిన సూచనలు చేసినట్లయితే వేరు పంటలు వేసుకునే వీలుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jun 23, 2019, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details