రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛను అర్హుల జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని చూసిన ప్రజలు అవాక్కవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న రేషన్ కార్డులను, వృద్ధాప్య పింఛన్లను తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పునియోజకవర్గంలోని ప్రతి వార్డులో వందల సంఖ్యలో పేర్లు గల్లంతయ్యాయి. కరెంట్ బిల్లు అధికంగా వస్తుందని.. ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని.. ఇంటి స్థలాలు, కార్లు ఉన్నాయంటూ అనేకమందిని అనర్హుల జాబితాలో చేర్చారు. అర్హులు తమ విజ్ఞప్తులను తెలుసుకునేందుకు, లేఖలను సమర్పించేందుకు ఒక్కరోజే గడువు ఉండటంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్ల జాబితాలో పేర్లు గల్లంతు - రేషన్ కార్డు వృద్ధాప్య పింఛన్ల జాబితాలో పేర్లు గల్లంతు
ప్రభుత్వం విడుదల చేసిన రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్ల అర్హుల జాబితా చూసుకుని జనం అవాక్కవుతున్నారు. తమకేమీ లేకపోయినా అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని ఆవేదన చెందారు.
రేషన్ కార్డు, వృద్ధాప్య పింఛన్ల జాబితాలో పేర్లు గల్లంతు