ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్​: కూలిన చెట్లు.. నీట మునిగిన పంటలు - కృష్ణా జిల్లాలో వర్షాలు తాజా వార్తలు

నివర్ తుపాన్ కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న వరి పంట నీట మునిగింది. రైతులు ఆందోళన చెందుతున్నారు.

nivar effect collapsed trees
కూలిన చెట్లు, నీట మునిగిన పంట

By

Published : Nov 26, 2020, 3:18 PM IST

నివర్ తుపాను ప్రభావం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. విజయవాడ విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్​లలో భారీ వృక్షం నేలకొరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలిపోవటం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గన్నవరం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉంగుటూరు మండలం నాగవరప్పాడులో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. అకాల వర్షానికి చేతి కందిన పంట నీటిపాలవ్వటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details