ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అతి తీవ్ర తుపానుగా‌ నివర్: విపత్తుల శాఖ

నివర్ తుఫాను అతి తీవ్ర తుపానుగా మారనుందని విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు వెల్లడించారు. కడలూర్​కి తూర్పు ఆగ్నేయంలో 90 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల శాఖ వెల్లడించింది.

nivar cyclone becomes very severe
అతి తీవ్ర తుపానుగా‌ నివర్

By

Published : Nov 25, 2020, 8:47 PM IST

నివర్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఇప్పటికే పెను తుపానుగా మారింది. అతి తీవ్ర తుపానుగా‌ నివర్ మారనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. పుదుచ్చేరికి 150 కి.మీ., చెన్నైకు 220 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. రేపు తెల్లవారుజామున తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో అతి తీవ్ర తుపానుగా‌ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65 - 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు పేర్కొన్నారు. రాత్రికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆయన వెల్లడించారు. రేపు చిత్తూరు , కర్నూలు ,ప్రకాశం, కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకోసం సిద్ధంగా ఉన్నయన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించారు. ఇల్లు సురక్షితం కాకపోతే సురక్షితమైన ఆశ్రయాలకు వెళ్లాలని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి , పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details