నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌ను సందర్శించారు. కలెక్టర్ ఇంతియాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ స్టాళ్లను రాజీవ్ కుమార్ పరిశీలించారు. అనంతరం పెద ఆవుటిపల్లిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడారు. ఆత్కూరులో... ప్రకృతి వ్యవసాయం విధానంతో సాగుచేస్తోన్న పెరటి కూరగాయాలను తిలకించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్టులో 13 జిల్లాలకు చెందిన రైతులు ఏర్పాటు చేసిన ప్రకృతి ఆధారిత వ్యవసాయ సాగు ప్రదర్శనలను తిలకించారు. ఆరోగ్య భారత్ సాధ్యం కావాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై దృష్టి సారించాలని, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రకృతి వ్యవసాయ రైతులు, శిక్షకులతో స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయశాఖ ముఖ్య సలహాదారు విజయ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమార్, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్వర్ణ భారత్ ట్రస్టుకు.. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ - latest news about niti aayog vice chairman
రాష్ట్ర పర్యటనలో ఉన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్.. కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టును సందర్శించారు. ట్రస్టులో ఏర్పాటుచేసిన వ్యవసాయ ఆధారిత స్టాళ్లను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు.
neetiaayog
TAGGED:
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్