ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NITI AAYOG: వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన - TELUGU NEWS

NITI AAYOG: కృష్ణా జిల్లాలోని వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటిస్తోంది. గ్రామంలోని విజయ్ కుమార్ అనే రైతులో ప్రకృతి వ్యవసాయం గురించి చర్చిస్తున్నారు.

niti-aayog-members-visited-veerapanenigudem-on-natural-farming
వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన

By

Published : Dec 1, 2021, 4:11 PM IST

వీరపనేనిగూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన

NITI AAYOG: కృష్ణా జిల్లాలోని గన్నవరం వీరపనేనిగూడెంలో ఏడుగురు నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటిస్తోంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ బృందం గ్రామంలోని తెల్లం విజయ్ కుమార్ అనే రైతుతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అంశాలను గురించి చర్చించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా సీఎం జగన్​ను, ఇతర అధికారులను కలిసేందుకు వెళ్లారు.

సాయంత్రం 04:30 గంటలకు వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాలతో సమావేశం కానున్నారు. అనంతరం 05:30 గంటలకు వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లు, విద్యా సంస్థల ప్రతినిధులు, సామజిక సంఘాల ప్రతినిధులతో భేటీ అవనున్నారు. డిసెంబర్ 2వ తేదీ ఉదయం గన్నవరం నుంచి విమానంలో దిల్లీ బయలుదేరి వెళతారు.

సంబంధిత కథనాలు:

ABOUT THE AUTHOR

...view details