ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూరాల ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల - కృష్ణా నదికి వరద

తెలుగు రాష్ట్రల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ జలకళను సంతరించుకుంది. వరద నీరు ఎక్కవగా ఉన్నందున తీర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

niranjan-reddy
జూరాల ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల

By

Published : Oct 16, 2020, 10:51 AM IST

ఏకధాటిగా కురుస్తున్న వానలకు కృష్ణమ్మ పోటెత్తింది. దీంతో జూరాల జలాశయం నిండుకుండలా మారింది. ఇన్​ఫ్లో 7లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కావున తీర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలిని తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సర్పంచులు, వీఆర్వో, వీఆర్‌ఏలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details