విజయవాడకు సమీపంలోని నిమ్రా ఆసుపత్రిని మూడో కోవిడ్ ఆసుపత్రిగా గుర్తిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో 600 పడకలు, వైద్యులు ఉన్నారని... కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన అదనపు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి, పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రులలోనూ కరోనా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టరు ఆదేశించారు.
కోవిడ్ వైద్యశాలగా నిమ్రా ఆసుపత్రి - కోవిడ్ వైద్యశాలగా నిమ్రా ఆసుపత్రి
విజయవాడకు సమీపంలోని నిమ్రా ఆసుపత్రిలోనూ కరోనా బాధితులకు చికిత్స అందించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో 600 పడకలు, వైద్యులు ఉన్నారని వెల్లడించారు.
కోవిడ్ వైద్యశాలగా నిమ్రా ఆసుపత్రి
కోవిడ్ నిర్దారణ పరీక్షల సామర్ధ్యం పెంచడంతోపాటు ఎప్పటికప్పుడు ఫలితాలు తెలపాలని కలెక్టర్ సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఎక్కువ శాతం నిర్ధరణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల సామర్ధ్యాన్ని పెంచేందుకు ల్యాబ్‌లలో ప్రైవేటు సంస్థల సహకారంతో అదనంగా మిషన్లు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టరు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'తెదేపా హయాంలోని ఆ పథకాలపై సీబీఐ విచారణ'