కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కొవిడ్ కేసుల్లో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. కరోనా సోకిన రాష్ట్ర మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి మాత్రం పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.
కరోనా అలా.. ముఖ్యమంత్రి ఇలా: చినరాజప్ప - జగన్పై నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు
ఒకపక్క రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుంటే దాని మీద దృష్టిపెట్టాల్సిన ప్రభుత్వం మూడు రాజధానులంటూ హడావిడి చేస్తోందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు.
నిమ్మకాయల చినరాజప్ప