ప్రభుత్వ భూములను చౌకగా వైకాపా నేతలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలుగుదేశం శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిఘటించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇసుక కొరతపై చంద్రబాబు చేసిన నిరసన దీక్ష విజయవంతమైందన్న ఆయన.. ప్రజలు పెద్ద ఎత్తున దీనికి మద్దతు తెలపడం ద్వారా ప్రభుత్వ వైఫల్యం బయటపడిందని అన్నారు. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పోస్టులు అమ్ముకునేందుకు మంత్రులు పోటీలు పడుతున్నారని రామానాయుడు మండిపడ్డారు. ఈ అంశాలన్నిటిపై నేడు పార్టీ ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
'చంద్రబాబు దీక్షతో ప్రభుత్వ వైఫల్యం బయటపడింది' - నిమ్మలరామానాయుడు తాజా న్యూస్
ఇసుక కొరతపై తెదేపా అధినేత చంద్రబాబు చేసిన దీక్ష విజయవంతమైందని ఆ పార్టీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

నిమ్మల రామానాయుడు
ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష విజయవంతమైందన్న తెదేపా నేత నిమ్మల రామానాయుడు
ఇదీ చూడండి: