ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పితాని కుటుంబాన్నీ రాజకీయంగా వేధిస్తున్నారు' - వైకాాపా ప్రభుత్వంపై తెదేపా ఆగ్రహం

పితాని కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు సీఎం జగన్ తన అవినీతి బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

nimmala ramanaidu on cm jagan
వైకాపాపై నిమ్మల రామానాయుడు

By

Published : Jul 11, 2020, 7:08 PM IST

సీఎం జగన్ తన పాలనపై తానే విశ్వాసం కోల్పోయారని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ తన అవినీతి బురదను అందరికీ అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగితే తాడేపల్లిలో పార్టీ కండువా కప్పుతున్నారని రామానాయుడు అన్నారు. పితాని కుటుంబాన్నీ రాజకీయంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

139 బీసీ కులాలకు.. 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని.. జగన్ పాదయాత్రలో చెప్పారని రామానాయుడు గుర్తు చేశారు. కానీ.. ఈ రోజు 139 మంది సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలను జైలుకు పంపే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని విమర్శించారు. వైకాపా బెదిరింపులకు భయపడకుకుండా ధైర్యంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details