ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం నిర్వహించాల్సింది 'రైతు దగా' ఉత్సవాలు: నిమ్మల - టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు తాజా వార్తలు

ప్రభుత్వం నిర్వహించాల్సింది రైతుదినోత్సవ ఉత్సవాలు కాదని.. రైతు దగా ఉత్సవాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో రైతులకు చేసింది శూన్యమని విమర్శించారు.

nimmala ramanaidu
nimmala ramanaidu

By

Published : Jul 8, 2020, 12:11 PM IST

ప్రతి రైతుకు ఏటా రూ. 12,500 ఇస్తానని చెప్పిన సీఎం జగన్.. రూ. 7,500 ఇచ్చి సరిపెట్టారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల ఏటా రూ. 5 వేలచొప్పున, 5 ఏళ్లలో ప్రతి రైతు రూ. 25 వేలు నష్టపోతున్నారని తెలిపారు. వైకాపా కార్యకర్తలైన వాలంటీర్ల కడుపునింపుతున్న ప్రభుత్వం.. రైతుల పొట్ట కొడుతోందని ఆరోపించారు.

64 లక్షల మంది రైతులకు రైతుభరోసా వర్తింపచేస్తామన్నజగన్ ప్రభుత్వం.. ఆ సంఖ్యను 40 లక్షలకు కుదించిందని నిమ్మల మండిపడ్డారు. 15 లక్షల మంది కౌలు రైతులకు రైతుభరోసా వర్తింపచేస్తామన్న ప్రభుత్వం.. కేవలం లక్షా 60వేల మందికి మాత్రమే వర్తించేలా పథకాన్ని కుదించారని విమర్శించారు.

రాష్ట్రంలో 70శాతం పైగా కౌలురైతులే ఉన్నారని.. వారికి మొండిచెయ్యి చూపడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా రైతులకు కులం లేదని.. జగన్ ప్రభుత్వం మాత్రమే రైతులకు కులాన్ని ఆపాదించి.. వారికి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పండిచిన ధాన్యాన్ని రైతుల నుంచి అరకొరగా కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఇప్పటికీ బకాయిలు ఇవ్వలేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

ఇదీ చదవండి:గాంధీలకు షాక్.. రాజీవ్ ఫౌండేషన్​పై విచారణకు కమిటీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details