ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే కాపు నేస్తం పథకంతో లబ్ధి' - కాపు నేస్తంపై చినరాజప్ప విమర్శలు

వైఎస్సార్ కాపు నేస్తం పథకంపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శలు గుప్పించారు. 25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే లబ్ధి చేకూరుస్తున్నారని దుయ్యబట్టారు.

chinarajappa
chinarajappa

By

Published : Jun 27, 2020, 5:22 PM IST

వైఎస్​ఆర్ కాపు నేస్తం పథకం అర్హులందరికీ అందడం లేదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 25 లక్షల మహిళల్లో ఒక్క శాతానికే కాపునేస్తం ఇవ్వడం మోసం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ పథకం ద్వారా ఇచ్చింది 354 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. కాపులకు 4,700 కోట్ల రూపాయలు ఇచ్చామన్న ప్రభుత్వ ప్రచారం అంకెల గారడీ మాత్రమేనని చినరాజప్ప దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details