NHRC: ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - ఏపీ సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
![NHRC: ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు http://10.10NHRC notice to AP CS.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/02-February-2022/14350965_nn.JPG](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14350965-367-14350965-1643798553858.jpg)
15:37 February 02
పోలవరం నిర్వాసితులకు పునరావాసం ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందన
NHRC notice to AP CS: పోలవరం నిర్వాసితులకు సరిగ్గా పునరావాసం కల్పించడం లేదన్న ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. ఏపీ సీఎస్, కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. 4 వారాల్లోగా స్పందించకుంటే తీవ్రంగా పరిగణిస్తామని నోటీసుల్లో హెచ్చరించింది. మానవహక్కులు పూర్తిగా ఉల్లంఘించినట్లు ఉందన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:
CM Review: ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం: సీఎం జగన్