జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)తమ ఫిర్యాదుపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆదేశాలు జారీ చేసిందని వెనుకబడిన వర్గాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలని, కులవృత్తుల వారు, వలస కార్మికులని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏప్రిల్ 21న జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.
'మా ఫిర్యాదు వల్లే సీఎస్‌కు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు'
తమ ఫిర్యాదుతోనే రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని వెనుకబడిన వర్గాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి తెలిపారు. తమ ఫిర్యాదులోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించిందని చెప్పారు.
'లాక్డౌన్ సయమంలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... కరెంటు బిల్లు, వాహనాలు పేరిట చాలా మంది లబ్ధిదారులకు పింఛను కూడా ఇవ్వలేదు. కేవలం 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా కరెంటు బిల్లులతో పేదలపై భారం మోపారు. వలస కార్మికుల కుటుంబాలని, కార్మిక శాఖ కార్డులు ఉన్న వారిని ఆదుకోలేదు. లాక్డౌన్ కాలానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబానికి నెలకు 5000 రూపాయలు, విద్యుత్తు ఛార్జీలు మాఫీ చేయాలని మేము ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదు చేశాం. ఆ విషయాలు సముచితమైనవిగా భావించిన ఎన్హెచ్ఆర్సీ... 8 వారాల్లోగా తగిన చర్యలు తీసుకొని తమకు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది' అని వెనుకబడిన వర్గాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి చెప్పారు.
ఇదీ చదవండి :'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరాం'