కృష్ణా నదిలో ఇసుక తవ్వకాల కార్యక్రమాలను సంయుక్త కమిటీ పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచించింది. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలతో జంతు, వృక్ష జాతులు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని అనుమోలు గాంధీ 2018లో ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ అంశాలపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం సర్వేలు చేయించి నివేదికలు సమర్పించింది.
సంయుక్త కమిటీ పర్యవేక్షణలోనే కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు
కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన కార్యక్రమాలు సంయుక్త కమిటీ పర్యవేక్షణించాలని ఎన్జీటీ.. రాష్ట్రప్రభుత్వాన్ని సూచించింది. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని దాఖలైన వ్యాజ్యంపై ఎన్జీటీ విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి నివేదికలు అందజేసింది. వీటిని పరిశీలించిన హరిత ట్రైబ్యునల్ ఇసుక తవ్వకాల కార్యక్రమాలు కమిటీ పర్యవేక్షణలో జరగాలని సూచిస్తూ విచారణ ముగించింది.
సంయుక్త కమిటీ పర్యవేక్షణలో కృష్ణా నదిలో ఇసుక తవ్వకాల కార్యక్రమాలు
ఆ నివేదికల అధ్యయనానికి ఎన్జీటీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయగా.. నాణ్యత మినహా ఇతర అంశాలు సంతృప్తిగా ఉన్నాయని కమిటీ తేల్చి చెప్పింది. పర్యావరణానికి హాని లేదని సంయుక్త కమిటీ చెప్పడంతో.. ఇకపై ఇసుక తవ్వకాల కార్యక్రమాలు కమిటీ పర్యవేక్షణలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను ముగించింది.
ఇదీ చదవండి :వృత్తి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు