ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో నూతన సంవత్సర వేడుకలు - మైలవరంలో నూతన సంవత్సర వేడుకలు

కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్​ రావు క్యాంపు కార్యాలయాల్లో.. నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు.

new year celebrations in  mylavaram and nandigama mla's camp office
మైలవరం, నందిగామ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో.. నూతన సంవత్సర వేడుకలు

By

Published : Jan 1, 2021, 1:30 PM IST

కృష్ణా జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలంతా కోలుకొని.. సుఖంగా, ఆరోగ్యంగా జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

నందిగామలో

నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఆయనను కలిసి.. పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

నందిగామ తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్ తంగిరాల సౌమ్య, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details