నూతన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ శరవేగంగా ముస్తాబవుతోంది. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా, ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టుగా ఉన్న భవనాన్ని... రాజ్‌భవన్‌గా తీర్చిదిద్దుతున్నారు. గవర్నర్ నివాసంలో ఉండాల్సిన వస్తువులు, ఇతర మౌలిక సదుపాయలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ వ్యక్తిగత సిబ్బందికి అవసరమైన వసతి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ భవనానికి కలంకారీ హంగులు అద్దాలని.. సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించింది. రాజ్‌భవన్ పనులను గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. రాజ్‌భవన్‌లో జాతీయ పతాక స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో... త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.
రేపు గవర్నర్ ప్రమాణ స్వీకారం..ముస్తాబవుతున్న రాజ్‌భవన్ - bishwabhushan harichandan
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమించిన బిశ్వభూషన్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా, ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టుగా ఉన్న భవనం నూతన హంగులతో రాజ్‌భవన్‌గా రూపుదిద్దుకుంటోంది.
ముస్తాబవుతున్న రాజ్‌భవన్