ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 22, 2021, 9:00 AM IST

ETV Bharat / state

విజయవాడలో నూతన ఆక్సిజన్​ ప్లాంట్​కు శంకుస్థాపన

విజయవాడలో నిమిషానికి 3 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్ ప్లాంట్​ ఏర్పాటుకు జిల్లా కొవిడ్‌ ప్రత్యేక అధికారి కే. ప్రవీణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి పీఎం కేర్ నిధులను కేటాయించమన్నారు. పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్​లలో అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం గలదిగా ఈ ప్లాంట్ నిలుస్తుందని చెప్పారు.

New oxygen plant
ఆక్సిజన్​ ప్లాంట్​కు శంకుస్థాపన

విజయవాడ కొత్తాసుపత్రి ఆవరణలో నిమిషానికి 3 వేల లీటర్ల కెపాసిటీతో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కొవిడ్‌ ప్రత్యేక అధికారి కె.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్లాంటు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన ప్లాంట్లలో ఇదే అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం పీఎంకేర్స్‌ నుంచి ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి నిధులను కేటాయించారని వివరించారు. దీనికి రూ.5 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ ఎల్‌.శివశంకర్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కె.శివశంకర్‌, సీఎస్‌ఆర్‌ఎంఓ హనుమంతరావు, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ డీవీ నారాయణ, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ జి.ప్రవీణ్‌రాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details