మహిళలకు భద్రత కల్పించటమే తమ లక్ష్యమని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయవాడలో దిశ నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రత్యేకాధికారులు కృత్తికాశుక్లా, దీపికలతో కలిసి ప్రారంభించారు. దిశ చట్టం అమలు చేసేందుకు కావాల్సిన సదుపాయాలు అందుబాటులో ఉంచామని కృత్తికా తెలిపారు. బాధితులకు సత్వరన్యాయం చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 122 మంది ఫిర్యాదులు రాగా.. 37 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు. దిశ చట్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని సీపి ద్వారకా తిరుమలరావు అభిప్రాయపడ్డారు.
దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీపీ - దిశ చట్టంపై మాట్లాడిన విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో మహిళల భద్రతకు భరోసా కల్పిస్తామని విజయవాడ సీపీ ద్వారక తిరుమల రావు చెప్పారు.
విజయవాడలో దిశ పోలీస్ స్టేషన్