ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు సంక్షేమమే వైకాపా ప్రభుత్వ ధ్యేయం' - నందిగామ ఎమ్మెల్యే జగన్​ మోహన్ రావు వార్తలు

రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని నందిగామ ఎమ్మెల్యే జగన్​ మోహన్ రావు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

nandigama mla
nandigama mla

By

Published : May 4, 2020, 5:20 PM IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలోని సమావేశ భవనంలో... వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నూతన కమిటీ ఛైర్మన్​గా వెలగపూడి వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మన్​గా సీతారామయ్య, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. యార్డు కార్యదర్శి రవి కుమార్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details