తెలంగాణ మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలో ఈనెల 3న వ్యాపారి నర్సింహారెడ్డి ఇంట్లో భారీ చోరి జరిగింది. కేసు దర్యాప్తులో ఆ ఇంట్లో పని చేసే నేపాల్‌కు చెందిన వ్యక్తితోపాటు మరో ముగ్గురు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దొంగల కోసం రాచకొండ పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ నేపాల్'లో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ముఠా సభ్యులంతా ఒకేచోట ఉండరు. ఒక్కో నగరంలో ఒక్కొక్కరు ఇంటి పనికి చేరతారు. ఎక్కడ గిట్టుబాటు అవుతుంతో తెలిశాకా అందరూ అక్కడికి చేరుకుని సొత్తుతో ఉడాయిస్తారు. ఒక్కసారి దొంగతనం చేసిన నగరంలో తిరిగి మరొకటి చేయరు.
సామాజిక మాధ్యమాల్లోనే
ఫేస్‌బుక్ మెసెంజర్, వైబర్ తదితర సామాజిక మాధ్యమాల్లోనే ముఠా సభ్యులు మాట్లాడుకుంటారు. లూథియానా, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లోని విలాసవంతమైన ఇళ్లల్లో పనికి కుదిరి నమ్మకంగా పని చేస్తారు. కొద్దిరోజుల తర్వాత ఆకస్మాత్తుగా పని మానేస్తారు. ఇంటికి వెళ్లాలంటూ.. నా స్థానంలో మా బంధువును పనికి కుదుర్చుతానంటూ చెబుతారు. ఆ పేరు మీద అసలు దొంగను రంగంలోకి దింపుతారు. సైనిక్‌పురిలో ఆరు నెలల క్రితం పని చేసిన వ్యక్తి మానేస్తూ.. మరో వ్యక్తిని పనికి కుదిర్చాడు.
ఇదే తరహాలో