ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిందితులను వదిలేసి బాధితుడి కుటుంబాన్ని వేధిస్తున్నారు' - గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద దళితుల నిరసన

దాదాపు నెల క్రితం జరిగిన దాడి ఘటనలో నిందితులను వదిలేసి బాధితుడి కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారంటూ దాదాపు 100 మంది దళితులు ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా గుడివాడ ఆర్డీవోని కలిసి.. తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

dalits protest at gudivada rdo office, dalits request letter to gudivada rdo
గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద దళితుల నిరసన, గుడివాడ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించిన దళితులు

By

Published : Apr 17, 2021, 10:05 PM IST

కృష్ణాజిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద దళితులు నిరసన చేపట్టారు. ఒకటో పట్టణ పోలీసులు వేధిస్తున్నారంటూ.. గుడ్​మెన్​పేటకు చెందిన మార్తా ఏసేబు, కోన మేరీ సహా సుమారు 100 మంది ఎస్సీ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దళితులకు ఒక న్యాయం ఇతరులకు మరొకటా అని నిలదీశారు.

ఇదీ చదవండి:వాహనంపై సీఆర్​పీఎఫ్ కాల్పులు- మహిళకు గాయాలు

గత నెల 24న స్థానిక మార్కెట్ వద్ద జరిగిన దాడి ఘటనలో.. ముద్దాయిని విడిచిపెట్టి, బాధితుడు మార్తా వివేక్ కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. అతడిపై దాడిచేసి అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి కారణమైన.. బత్తుల మురళి, పులిపాక మహేష్, బంటితో పాటు వారికి సాయం చేసిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చూడాలని ఆర్డీవో గేదెల శీనుకు వినతి పత్రం సమర్పించారు.

ఇదీ చదవండి:

గుడివాడలో వస్త్ర సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details