కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు సీఎం జగన్ ఫొటోకి క్షీరాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే అని నాయకులు కొనియాడారు. జగనన్న చేదోడు పథకంతో కుల వృత్తి చేసుకుంటూ జీవించే ఎన్నో వేల కుటుంబాలకు ... అండగా ఉన్నాడని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, నాయీ బ్రహ్మణ సంఘ అధ్యక్షుడు అవనిగడ్డ బ్రహ్మయ్య, వైస్ ప్రెసిడెంట్ శివయ్య, సెక్రటరీ యేసు, 35 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో సీఎం జగన్ ఫొటోకి క్షీరాభిషేకం.. - అవనిగడ్డలో నాయిబ్రాహ్మణ నాయకుల వార్తలు
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సీఎం జగన్ ఫొటోకి క్షీరాభిషేకం చేశారు. నాయిబ్రాహ్మణులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడం...ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని వారు కొనియాడారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో సీఎం జగన్ ఫోటోకి పాలాభిషేకం