వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు దేశీయ పర్యాటక వ్యయం, అభివృద్ధిని నిర్దేశించే బహుళ సూచికలపై జాతీయస్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాంతాల వారీగా జాతీయ గణాంక కార్యాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ, కడపలోని జాతీయ గణాంక కార్యాలయాల పరిధిలో నాలుగు రోజులపాటు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు.
దేశంలో అతిథ్యం, హస్తకళలు, రవాణ సేవలు, సహజ వనరులు వంటి వివిధ రంగాలు ఉపాధి కల్పనతో పాటు పర్యాటక ప్రాముఖ్యతను పెంచుతున్నాయని కార్యక్రమానికి హాజరైన వక్తలు తెలిపారు. పర్యాటక ప్రదేశాల సందర్శనతో పాటు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఆసుపత్రులకు వెళ్లడం, రాత్రిపూట ఆతిథ్య కేంద్రాల్లో బస చేయడం వంటివి పర్యాటక వ్యయంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు.