ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ చట్టాల రద్దుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ: ఏపీసీసీ నేత గంగాధర్

కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవసాయ బిల్లులను ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోవడాన్ని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డా.గంగాధర్ తప్పుబట్టారు. ఈ బిల్లులు చట్టాలుగా మారడం వల్ల రైతులు వారి భూమిలోనే కూలీలుగా మారిపోయే ముప్పు పొంచి ఉందని అన్నారు. విజయవాడలో ఏపీసీసీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఆ చట్టాల రద్దుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ : ఏపీసీసీ నేత గంగాధర్
ఆ చట్టాల రద్దుకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ : ఏపీసీసీ నేత గంగాధర్

By

Published : Sep 30, 2020, 5:41 PM IST

కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవసాయ బిల్లులను ఆగమేఘాల మీద చట్టాలుగా మార్చిందని, వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. వ్యవసాయ బిల్లుల ఆమోదం పూర్తిగా రైతు వ్యతిరేక చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.

అప్పు కోసమే ఇదంతా..

కేంద్రం నుంచి వచ్చే అప్పు కోసం సీఎం జగన్ కేంద్రం షరతులకు లోబడి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డా.గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకారం చుడతాం..

ఎక్కడి నుంచి మీటర్లు బిగిస్తారో అక్కడి నుంచే ఆ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. అక్టోబర్ 2 నుంచి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. సంతకాలు సేకరణను ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తారన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details