ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ఎల్ఐసీలో ఐపీవో తీసుకురావాలనే కేంద్రం నిర్ణయాన్ని క్లాస్-1 ఆఫీసర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యదర్శి నత్వాజ్ వెన్స్ అన్నారు. ప్రైవేటీకరణలో భాగంగా భారతీయ జీవిత బీమా సంస్థ నుంచి కొంత వాటాను విక్రయించే ప్రక్రియను భారత ప్రభుత్వం ప్రారంభించింది. దీనిని ఖండిస్తూ.. ఈ నెల 22న దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామన్నారు.
'ఎల్ఐసీలో ఐపీవో విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఈ నెల 22న దేశవ్యాప్త నిరసన' - lic latest news
భారతీయ జీవిత బీమా సంస్థలో ఐపీవో తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని క్లాస్-1 ఆఫీసర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యదర్శి అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ప్రెస్మీట్లో చెప్పారు.
క్లాస్-1 ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రెస్మీట్
కేంద్రం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వేతన సవరణ, కుటుంబ, నూతన పెన్షన్ విధానం రద్దు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పెట్టుబడి ఐదు కోట్లు కాగా, ఏటా డివిడెండ్ రూపంలో రెండు వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఎల్ఐసీ అందిస్తుందని వివరించారు. ప్రజా ప్రయోజనాల కోసం విద్యుత్, రవాణా, రైల్వేశాఖల్లో భారీ పెట్టుబడులను సంస్థ సమకూరుస్తోందన్నారు.