నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 26, 27న నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవరావు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మైలవరంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే వాటిని తీసుకు వచ్చారని విమర్శించారు. అనంతరం కార్మిక సంఘం పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
'వ్యవసాయ చట్టాలతో రైతులకు ఒరిగేదేమి లేదు' - కార్మిక సంఘం పోస్టర్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26, 27న చేపట్టనున్న నిరసనను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే తప్ప వాటితో రైతులకు మేలు జరగదని వివరించారు. సంబంధిత పోస్టర్ను విడుదల చేశారు.
రైతులకు ఒరిగేదేమి లేదు