ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లా కలెక్టర్‌పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం - కొల్లేరు సరస్సు నష్టంపై ఎన్జీటీ ఆదేశాలు

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్​పై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్​జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు సరస్సు విషయంలో గతేడాది తాము ఇచ్చిన ఆదేశాలను అలసత్వం చేశారని అసంతృప్తి వ్యక్త పరిచింది.

NGT
NGT

By

Published : Jul 26, 2020, 7:09 AM IST

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్​పై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్​జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు సరస్సుకు జరుగుతున్న నష్టంపై నివేదిక సమర్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవవైవిధ్యం, జల జీవనం కోల్పోతున్న వ్యవహారాలపై గతేడాది ఎన్జీటీ నివేదిక కోరింది.

'గతేడాది ఇచ్చిన మేం ఇచ్చిన ఆదేశాలను అలసత్వం చేశారు. ఏడాదిపైగా గడిచినప్పటికీ నివేదిక ఇవ్వకపోవడం ఏమిటి?. నివేదికను ఇవ్వడానికి మీకు చివరి అవకాశాన్ని ఇస్తున్నాం. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా మేజిస్ట్రేట్‌లతో కూడిన కమిటీ నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇవ్వకుంటే తగిన చర్యలుంటాయి' అని ఎన్జీటీ త్రిసభ్య ధర్మాసనం... కృష్ణా జిల్లా కలెక్టర్​ను హెచ్చరించింది. కేసు తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 5కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details