ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంకు నాట్కో ఫార్మా లేఖ: 'లక్ష మందికి ఉచితంగా మందులు ఇస్తాం' - Distribute free medicines to one lakh corona patients by Natco Pharma

ముఖ్యమంత్రి జగన్‌కు నాట్కో ఫార్మా లేఖ రాసింది. నాట్కో ట్రస్టు తరఫున కరోనా మందులను ఉచితంగా ఇస్తామని వెల్లడించింది.

'సీఎం జగన్​కు నాట్కో ఫార్మా లేఖ.. లక్ష మంది కరోనా రోగులకు మందులు ఇస్తాం'
'సీఎం జగన్​కు నాట్కో ఫార్మా లేఖ.. లక్ష మంది కరోనా రోగులకు మందులు ఇస్తాం'

By

Published : May 21, 2021, 10:01 PM IST

ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన నాట్కో ఫార్మా... తమ ట్రస్టు తరఫున కరోనా మందులను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. బారినట్‌ టాబ్లెట్స్‌ ఉచితంగా ఇస్తామని లేఖలో పేర్కొంది. సుమారు లక్ష మంది కరోనా రోగులకు ఔషధాలు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.

కొన్ని వారాల్లో..

రూ.4.2 కోట్లు ఖరీదు చేసే టాబ్లెట్లను ఉచితంగా ఇస్తామని నాట్కో వివరించింది. ఈ మేరకు కొన్ని వారాల్లో టాబ్లెట్లను ఇస్తామని సంస్థ మేనేజింగ్ ట్రస్టీ వి.సి నన్నపనేని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :రఘురామ ఎపిసోడ్: అరెస్టు నుంచి బెయిల్ వరకు ఇలా..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details