ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాట్కో ఫార్మా దాతృత్వం.. కోటికి పైగా విలువైన మందులు విరాళం - నాట్కో ఫార్మా సంస్థ విరాళం అప్​డేట్

కరోనాతో పోరాడేందుకు తమ వంతు సాయంగా ప్రభుత్వానికి కోటికి పైగా విలువైన మందులను అందిస్తున్నట్లు నాట్కో లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా కొవిడ్ బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

natco pharma company donation
నాట్కో ఫార్మా సంస్థ

By

Published : Aug 21, 2020, 7:53 AM IST

నాట్కో ట్రస్ట్ ద్వారా కోటికి పైగా విలువైన మందులను ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు ఫార్మా సంస్థ నాట్కో లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు తెలిపారు. కొవిడ్ చికిత్స పూర్తైన తరువాత రక్తం గడ్డకట్టకుండా నివారించే అపిక్స్బాన్ 2.5 ఎంజి ట్యాబ్లెట్లు, ఎనో క్సాపారిన్ 60ఎంజి ఇంజెక్షన్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ డా. కెఎస్ జవహర్ రెడ్డికి అందచేశారు. వీటి విలువ సుమారు కోటి 2 లక్షల విలువ ఉంటుందన్నారు.

విజయవాడలోని ఆర్ అండ్ బీ బిల్డింగ్​లోని తన ఛాంబర్​లో అందజేసినట్లు వివరించారు. ఈ ఔషధాలను అవసరమైన వారికి వైద్య నిపుణుల సూచన మేరకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాని కోరారు. సీఎస్ఆర్​లో భాగంగా కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతగా కొవిడ్ బాధితులను ఆదుకోవాలనీ.. ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. కొవిడ్​తో పోరాడేందుకు ఇప్పటికే పలు సంస్థలు యాజమాన్యాలు ముందుకొచ్చి.. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలివ్వటం అభినందనీయమమన్నారు.

ABOUT THE AUTHOR

...view details