ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఆరోగ్యశ్రీ కింద పునరావాస కేంద్రాల్లో చికిత్స" - rehabilitation centres

మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కోరారు. మద్యానికి బానిసలైన వారిని మామాలుగా మార్చేందుకు అయ్యే ఖర్చును ఆరోగ్రశ్రీ కిందకు తీసుకురావాలని సీఎం జగన్​ను కోరనున్నట్లు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి

By

Published : Sep 5, 2019, 7:55 PM IST

విజయవాడ నగర శివారు నున్న గ్రామ సమీపంలోని మానసిక పరివర్తనా కేంద్రం ఇండ్లాస్ శాంతివనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి సందర్శించారు. మత్తు పదార్థాలకు బానిసలై పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. మద్యపాన నిషేధ నిర్ణయంపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం మీడియాతో నారాయణ స్వామి మాట్లాడారు.

మీడియాతో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి

మద్య నిషేదంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న దుకాణాల సంఖ్య తగ్గించామని తెలిపారు. బెల్టు షాపులను సమూలంగా రూపు మాపిన ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. మానసిక పరివర్తనా కేంద్రాలకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. మద్యపానం, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారు మానసిక పరివర్తనా కేంద్రాల్లో చికిత్స తీసుకునేందుకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా భరించాలన్న ప్రతిపాదనను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు నారాయణ స్వామి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details