ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గర్భిణి మృతికి.. ప్రభుత్వ చేతకాని పాలనే కారణం: లోకేశ్ - Naralokesh latest updates

కాకినాడకు చెందిన గర్భణి, వాలంటీర్ లక్ష్మి మృతిపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రిలో చేరిన తనకు వైద్యం అందట్లేదని వేడుకున్నా.. ఆమెను ఎవరు పట్టించుకోలేదన్నారు.

నారాలోకేశ్
నారాలోకేశ్

By

Published : May 10, 2021, 3:26 PM IST

ట్వీట్ చేసిన నారాలోకేశ్

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రమణయ్య ప్రాంతానికి చెందిన గర్భిణి, వాలంటీర్ లక్ష్మి.. కొవిడ్‌తో ప్రభుత్వాసుపత్రిలో చేరి తనకు వైద్యం అందట్లేదని వేడుకున్నా.. ఆమెను ఎవరూ పట్టించుకోక మరణించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ ఆదేశించినా వైద్యమందక కడుపులో బిడ్డతో సహా కన్నమూయాల్సి రావడానికి.. జగన్‌ చేతకాని పాలనే కారణం కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా తాడేపల్లి రాజప్రాసాదంలో కూర్చుని ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టాలనే కుతంత్రాలు మాని.. ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details