'తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అక్రమాలకు పాల్పడింది' - తిరుపతి ఎన్నికలో వైకాపా అక్రమాలు
తిరుపతి ఉపఎన్నికలో విజయం కోసం వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహరావు ఆరోపించారు. ప్రజా ప్రతినిధులే పోలింగ్ బూత్ల వద్ద ఉండి ఓటర్లను ప్రభావితం చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు.
తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఏఐసీసీ సభ్యుడు నరహరశెట్టి నరసింహరావు ఆరోపించారు. దొంగ ఓట్లు వేయడం కోసం బస్సుల్లో జనాల్ని తరలించడం దారుణమన్నారు. దొంగ ఓటర్లను అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా ప్రతినిధి కాని సజ్జల రామకృష్ణరెడ్డి తిరుపతి ఉప ఎన్నిక గురించి మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికలు ఇంత అ ప్రజాస్వామ్య పద్దతిలో జరగడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వెంటనే కలుగజేసుకోని తిరుపతి ఉపఎన్నికను తిరిగి చేపట్టాలని కోరారు.