మాస్కు వేసుకోలేదని బంగారు భవిష్యత్తు ఉన్న ఎస్సీ యువకుడు కిరణ్‌ని కొట్టి చంపేసి ఇప్పుడు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కిరణ్ మృతిపై నిష్పక్షపాతమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శిరోముండనం, కొట్టి చంపటం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని లోకేశ్తేల్చి చెప్పారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన ఓ వీడియోను లోకేశ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
'ఎస్సీ యువకుడిని చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి' - police murders si boy due to no mask
మాస్కు వేసుకోలేదని ఎస్సీ యువకుడిని చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
'ఎస్సీ యువకుడిని చంపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి'