కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన ఘర్షణల్లో కొంత మంది దుండగులు సౌమ్య ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ సౌమ్యను పరామర్శించి.. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన లోకేశ్.... శ్రేణులు వైకాపా అరాచకాలపై ధైర్యంగా పోరాడాలని సూచించారు. లోకేశ్ పర్యటనలో తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తంగిరాల సౌమ్య, కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్ - కృష్ణా జిల్లాలో నారా లోకేశ్ పర్యటన
కృష్ణా జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్ పరామర్శించారు. ఇటీవల సౌమ్య నివాసంపై దాడి జరిగిన క్రమంలో లోకేశ్ పరామర్శించారు.
![తంగిరాల సౌమ్య, కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్ Nara Lokesh,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10768416-735-10768416-1614230803138.jpg)
Nara Lokesh,
తంగిరాల సౌమ్య, కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్
ఇదీ చదవండి:పర్యావరణాన్ని కాపాడేందుకు.. ఒక్క అడుగు!
Last Updated : Feb 25, 2021, 11:29 AM IST