'కరోనా కల్లోల సమయంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు - విద్యాసంవత్సరం వృథా' అనే అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు జరిగే ఈ భేటీలో విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొననున్నారు.
విద్యా సంవత్సరం వృథాపై ... నేడు నారా లోకేశ్ వర్చువల్ సమావేశం - LOEKSH
బుధవారం ఉదయం 11 గంటలకు 'కరోనా కల్లోల సమయంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు - విద్యాసంవత్సరం వృథా' అనే అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొననున్నారు.
పది, ఇంటర్ పరీక్షలు జులైలో నిర్వహిస్తే ఫలితాలు, రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి సెప్టెంబరు దాటిపోతుందన్నది లోకేశ్ వాదన. అక్టోబర్‌లో ఆలస్యంగా విద్యాసంవత్సరం ప్రారంభించటం వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు వెనుకపడిపోవటంతో పాటు వివిధ రకాలుగా నష్టపోతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా కొవిడ్ తీవ్రత దృష్ట్యా పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి ఇతర రాష్ట్రాలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ బోర్డు తరహాలో ఇంటర్నల్ మార్కులు ఆధారంగా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలనే డిమాండ్‌పై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు.
ఇవీ చదవండి
Inter Exams: వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు
TAGGED:
LOEKSH