ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయం నుంచి కర్నూలు జిల్లా 11వ వార్డుకు చెందిన తెదేపా అభ్యర్థి మహబూబ్ అలీ ఖాన్‌ను వైకాపాలో చేరాలని... వైకాపా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. పార్టీ మారకుండా మహబూబ్ అలీఖాన్ తెదేపాలోనే కొనసాగటంతో బెదిరింపులకు గురయ్యాడు. మహబూబ్ అలీ ఖాన్ ఇంట్లో లేని సమయంలో వైకాపా నాయకులు అతని ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో వాళ్లని భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయం తెలుసుకున్న నారా లోకేశ్.. అలీఖాన్‌కి ఫోన్ చేసి పరామర్శించారు.
బెదిరింపులకు గురైన తెదేపా అభ్యర్థికి నారా లోకేశ్ పరామర్శ - తెదేపా అభ్యర్థికి నారా లోకేశ్ ఫోన్లో పరమార్శ
కర్నూలు వైకాపా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు చేతిలో బెదిరింపులకు గురైన కర్నూలు జిల్లా 11వ డివిజన్ తెదేపా అభ్యర్థి మహబూబ్ అలీఖాన్‌ను... పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. అతనికి అతడి కుటుంబసభ్యులకు అండగా ఉంటానని లోకేశ్ భరోసా ఇచ్చారు.

బెదిరింపులకు పాల్పడ్డ తెదేపా అభ్యర్థికి నారా లోకేశ్ ఫోన్లో పరమార్శ