వైకాపా ప్రభుత్వ పనితీరు కారణంగా ఉల్లి ధర వందకు చేరిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తే ఏంటో అనుకున్నామని... కానీ మహిళలు రైతు బజార్లో ఉల్లి కొనడానికి జగనన్న ఉల్లి కార్డు, నిత్యావసర సరకులు కొనుక్కోవడానికి వైకాపా సరకుల కార్డు, ప్రజలు ఇసుక కొనడానికి వైఎస్ ఇసుక భరోసా కార్డు ఇస్తారనుకోలేదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పనితీరుతోనే ఉల్లి ధరకు రెక్కలు: నారా లోకేశ్ - lokesh comments on raising onion prices latest news
వైకాపా ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కారణంగా... ఉల్లి ధర వందకు చేరిందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ప్రభుత్వ పనితీరుకు ఉల్లి ధర పెరిగిందన్న నారా లోకేశ్ప్రభుత్వ పనితీరుకు ఉల్లి ధర పెరిగిందన్న నారా లోకేశ్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాల్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వమని... ఆంక్షలు పెట్టి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: బూతుల మంత్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే.. మేం చేసిన తప్పు !
TAGGED:
lokesh twitter latest news