ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడు రాజధానులు కావాలంటే ఆ చట్టాన్ని సవరించాలి: లోకేశ్​

By

Published : Mar 24, 2022, 5:27 PM IST

Nara Lokesh News: మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్​లో సవరణ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇదే విషయం కోర్టు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

మూడు రాజధానులు కావాలంటే ఆ చట్టాన్ని సవరించాలి: లోకేశ్​

మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టానికి పార్లమెంట్ సవరణ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్పష్టం చేశారు. అదే విషయం కోర్టు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి అర్థం కావడంలేదన్న లోకేశ్​.. ఈ అంశంలో మాత్రమే శాసన సభలకు అధికారం లేదని చెప్పిందని గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గాన్ని జిల్లా చేస్తారా..175 నియోజకవర్గాలను జిల్లాలు మార్చండని లోకేశ్​ విమర్శించారు. పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు ఇవ్వలేక ప్రజల దృష్టిమరల్చేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు అని లోకేశ్‌ మండిపడ్డారు. కొత్త జిల్లాల వలన ఉపయోగం ఏంటి..? ఒక్క ఉద్యోగం అయినా వస్తుందా? అని ప్రశ్నించారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 60శాతం బ్రాండ్స్ తెచ్చారని.. వాటిలో 140 కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చారన్నారు. వైకాపా బ్రాండ్స్ కాబట్టే అవి మూయలేదని.. అన్నక్యాంటీన్, చంద్రన్న భీమా లాంటి చంద్రబాబు పథకాలను మాత్రమే మూసేశారని చాలా స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. పరిపాలన ఒకే చోట ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేది చంద్రబాబు నినాదమని లోకేశ్‌ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా అని నిలదీశారు. చిన్న జిల్లాలు చేస్తే అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details