ఈ రోజు రైతు దగా దినోత్సవమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విత్తనాలు ఇవ్వలేని కుమారుడు,రూ. 14 వేల మంది రైతుల్ని బలిగొని వ్యవసాయ రంగాన్ని చిన్నాభిన్నం చేసిన తండ్రి జన్మదినాన్ని రైతు దినోత్సవం అంటూ ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం వృథా చేయడం దారుణమని అన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లోనూ, రైతు భరోసాలోనూ కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఈ రోజు రైతు దగా దినోత్సవం'
ఈ రోజు రైతు దగా దినోత్సవమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని చిన్నభిన్నం చేసిన వ్యక్తి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించి ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.
రైతు దినోత్సవంపై నారా లోకేశ్
గిట్టుబాటు ధర అడ్రెస్స్ లేదని, ఏడాదికి లక్ష రూపాయిల లబ్ధి రత్నం గల్లంతైందని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న సున్నా వడ్డీకి పేరు మార్పు చేశారని లోకేశ్ దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ పథకానికి పేరు మార్చారన్నారు. వీటివల్ల రైతన్నకు ఒరిగింది ఏమీలేదని నారా లోకేశ్ అన్నారు.
ఇదీ చదవండి: వలస జీవులను వెంటాడుతున్న బతుకు భయం