ఆస్పత్రుల్లో పడకలు లేక రోడ్ల మీదే వదిలేస్తున్నారని కోవిడ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. అవసరానికి మించి పడకలు ఏర్పాటు చేశామని సీఎం జగన్ మాయమాటలు చెబుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సీఎం జగన్.. ఇప్పటికైనా కళ్లు తెరవండి'
కరోనా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేశ్ కోరారు. అస్పత్రుల్లో అవసరానికి సరిపడా పడకలు ఏర్పాటు చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
కరోనా రోగులకు సదుపాయాలపై నారా లోకేశ్
అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామానికి చెందిన మన్మథ రెడ్డి తండ్రి కరోనాతో మరణించారని, కుటుంబసభ్యులకు వైద్యం అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరవాలని లోకేశ్ అన్నారు. మడుగుపల్లి గ్రామానికి చెందిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
ఇదీ చదవండి: 'ప్రజలను గాలికి వదిలేశారు.. వైకాపా నాయకులకు అదునాతన వైద్యం అందిస్తున్నారు'
TAGGED:
nara lokesh fires on jagan