ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LOKESH: ఒక్క ఛాన్స్ సీఎం జగన్ ఏపీని ఆప్ఘనిస్తాన్​లా మార్చేశారు: నారా లోకేశ్ - Andhra pradesh

ఒక్క అవకాశంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​ని ఆఫ్ఘనిస్తాన్​లా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. నెల్లూరు ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్​కు జత చేశారు.

Nara Lokesh
ఒక్క ఛాన్స్ సీఎం జగన్ ఏపీని ఆప్ఘనిస్తాన్ లా మార్చేశారు -నారా లోకేశ్

By

Published : Sep 15, 2021, 3:33 PM IST

ఒక్క ఛాన్స్ సీఎం జగన్ ఏపీని ఆప్ఘనిస్తాన్ లా మార్చేశారు -నారా లోకేశ్

ఒక్క అవకాశం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​ని ఆఫ్ఘనిస్తాన్​లా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జగన్ రెడ్డి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తుండటం, రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డపై తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితుల్ని పట్టుకొని బెయిల్​పై అతిధి మర్యాదలతో ఇంటి వద్ద దింపకుండా కఠినంగా శిక్షిస్తేనే అరాచకాలకు బ్రేక్ పడుతుందని విమర్శించారు. నెల్లూరు ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ కు జత చేశారు.

ABOUT THE AUTHOR

...view details