ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 18, 2020, 5:20 PM IST

ETV Bharat / state

'జీవో నంబర్ 3 పై రివ్యూ పిటిషన్ వేయకపోవడం దారుణం'

జీవో నంబర్ 3 పై గిరిజనులు చేస్తున్న పోరాటానికి తెదేపా అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. జీవోను సుప్రీంకోర్టు రద్దు చేస్తే, వైకాపా ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ కూడా వేయకపోవడం దారుణమన్నారు.

nara lokesh fire on cm by go 3 issue at vijayawada
'జీవో నంబర్ 3 పై రివ్యూపిటిషన్ వేయకపోవడం దారుణం'

ట్విట్టర్ లో స్పందించిన నారా లోకేశ్

అమాయకులైన గిరిపుత్రులకు అన్యాయం చేయడానికి ముఖ్యమంత్రి జగన్​కు మనసెలా వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గిరిజనుల హక్కులను కాలరాసే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పించేలా జీఓ-3ను తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేస్తే, వైకాపా ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ కూడా వేయకపోవడం దారుణమన్నారు. ఈ విషయంపై గిరిజనులు చేస్తున్న పోరాటానికి తెదేపా అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గిరిజన హక్కులు కాపాడే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు గిరిజన సలహా మండలిలో చర్చించి ఎస్టీ ఉద్యోగ రిజర్వేషన్ కి సమగ్ర చట్టం రూపొందించాలని లోకేష్ డిమాండ్ చేశారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 425 నమోదు

ABOUT THE AUTHOR

...view details